Download Our App

ఎలాన్ మస్క్ పెద్ద మనసు.. భారత సంతతి వైద్యురాలికి ఆర్థిక సాయం.. !

Picture of RaamSee

RaamSee

Staff Reporter, Warangal

కరోనా మహమ్మారి 2020 ఏడాదిని తలకిందులు చేసింది. ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. దీంతో సామాన్య ప్రజలు మొదలు.. వ్యాపార వేత్తల వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వారి కష్టాలను చూసి కెనడాలోని భారత సంతతి వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ చలించిపోయారు. దీంతో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌, టీకా ఆదేశాలకు తీవ్ర విమర్శలు ఎదరయ్యాయి. వైద్యవర్గాలు సైతం ఆమెను తప్పుబట్టాయి.

ఆమెపై కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. నాటి నుంచి కోర్టు ఖర్చులను భరించలేక ఆ ఫీజుల కోసం నిధులను సమీకరించాల్సిన దుస్థితి తలెత్తింది. నిజానికి, డాక్టర్ కుల్విందర్ కౌర్ గిల్ కెనడాలో ఇమ్యునాలజీ అండ్‌ పీడియాట్రిక్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె కోర్టు కేసులో చిక్కుకుని కోర్టు ఖర్చుల నిమిత్తం 300,000 (రూ. 1,83,75,078) కెనడియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. దీంతో డబ్బు సాయం చేయండంటూ సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. ఆమెకు సాయం చేసేందుకు పలువురు దాతలతోపాటు ప్రముఖ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ ముందుకు వచ్చారు.

2020లో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కెనడియన్, అంటారియో ప్రభుత్వాల లాక్‌డౌన్‌, టీకా ఆదేశాలకు వ్యతిరేకంగా ట్విటర్‌ వేదికగా బహిరంగంగా అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు గానూ వైద్యవర్గాలు, మీడియా కలిపి మొత్తం 23 మంది ఆమెపై కోర్టులో దావా వేశాయి. దీన్ని సవాల్‌ చేసిన కుల్విందర్‌ తనపై కుట్రపూరితంగా కేసులు పెట్టారంటూ కోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెను తప్పుబడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. పిటీషనర్ల తరపు లలీగల్‌ ఖర్చుల కింద మూడు లక్షల కెనడా డాలర్లు (సుమారు రూ.2కోట్లు) మార్చి 31లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టులో పోరాడేందుకు తాను సంపాదించిందంతా ఖర్చయిపోగా.. అప్పులు కూడా చేయాల్సి వచ్చిందని కుల్విందర్ వాపోయారు. అంత మొత్తం చెల్లించడానికి ఆన్‌లైన్‌లో ఆమె క్రౌడ్ ఫండింగ్ ప్రచారం మొదలుపెట్టారు. అలా 2 లక్షల కెనడా డాలర్లు సమకూరాయి. ఈ విషయం తెలుసుకున్న ఎలన్‌ మస్క్‌ ఆమె చట్టపరమైన బిల్లులు చెల్లించేందుకు ముందుకొచ్చారు. మిగిలిన మొత్తాన్ని తాను చెల్లిస్తానని హామీ ఇచ్చారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు