Download Our App

230 మిలియన్ డాలర్లు వస్తాయనుకుంటే..

Picture of RaamSee

RaamSee

Staff Reporter, Warangal

US: సంపన్న రాజ్యాంగానే మాత్రమే కాదు.. ప్రపంచం మీద పెత్తనం చెలాయించే దేశంగా అమెరికాకు పేరు ఉంది. తన ప్రయోజనాల కోసం అమెరికా ఏదైనా చేస్తుంది. తనకు ఆటంకం కలుగుతోంది అని తెలిస్తే ఎంతటి పన్నాగానికైనా తెగిస్తుంది.

ఆ మధ్య ఉక్రెయిన్ దేశంతో రష్యా యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ వైపు ఉంది. తెర వెనుక ఆ దేశానికి సహకరించింది. ఈ క్రమంలో అమెరికా వేసిన తప్పటడుగు ఆ దేశానికి చుక్కలు చూపిస్తున్నది. మిలియన్ డాలర్లు అప్పనంగా ఖర్చు పెట్టేలా చేస్తోంది.

క్రిమియాతో సంబంధాలు ఉన్నాయని భావించి..

ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్నప్పుడు రష్యా దేశానికి చెందిన సంపన్నుడు సులేమాన్ కిర్మూవ్ కు క్రిమియాతో సంబంధాలు ఉన్నాయని భావించి.. అతడికి చెందిన విలాసవంతమైన ఓడను అమెరికా టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. దాదాపు 348 అడుగుల పొడవు ఉన్న ఈ ఓడ పేరు అమాడయా. 2022లో ఈ ఓడ ఫిజీ లోని సముద్ర తీరంలో ఉండగా..ఫిజీ అధికారులతో కలిసి అమెరికాకు చెందిన. ఎఫ్ బీ ఐ(FBI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. బంగారం వ్యాపారం చేస్తున్న సులేమాన్ కిర్మూవ్ అమెరికన్ బ్యాంకులను మోసగించడం వల్ల తాము అతడి ఓడను సీజ్ చేశామని అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఓడ శాండియాగోలోని సముద్ర తీరంలో ఉంది. అయితే ఈ ఓడను వేలం వేసి అమెరికన్ బ్యాంకులకు డబ్బులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఫెడరల్ న్యాయవాదులు కోర్టును కోరారు. ఇప్పటివరకు ఈ నౌక నిర్వహణ కోసం అమెరికా 20 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సగటున నెలకు ఈ ఓడ నిర్వహణకు ఆరు లక్షల డాలర్లు అమెరికా ఖర్చు చేస్తోందని వివరించారు. బీమా ఖర్చులకి 1.4 లక్షల డాలర్లు, ఇతర ఖర్చులకు 1.78 లక్షల డాలర్లను అమెరికా వెచ్చించిందని న్యాయవాదులు తెలిపారు. అయితే కోర్టు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

230 మిలియన్ డాలర్లు వస్తాయనుకుంటే..

అమెరికా మార్షల్ సర్వీస్ నివేదిక ప్రకారం ఈ ఓడ విలువ 230 మిలియన్ డాలర్లుగా లెక్క కట్టింది. ఇదంతా జరుగుతుండగానే ఈ నౌక తమదని ఓ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ ఓడ విక్రయించాలని అమెరికా న్యాయవాదులు కోర్టును కోరడాన్ని తప్పు పట్టింది. అమెరికన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు ఆ ఓడను జప్తు చేయాలని నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని కోరింది. ఒకవేళ అమెరికా కోరితే ఆ ఓడ నిర్వహణ కోసం ఇప్పటివరకు వెచ్చించిన నగదు మొత్తం తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. అయితే దీనిపై కోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందోనని అమెరికా ఎఫ్ బీ ఐ అధికారులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా ఈ ఓడను అమ్మడం ద్వారా భారీగా వెనుక వేసుకోవాలని భావించింది. కానీ అడుగడుగునా చిక్కు ముళ్ళు ఎదురవుతున్న నేపథ్యంలో.. అనవసరంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు